Hin

27th june2024 soul sustenance telugu

June 27, 2024

విజయం కోసం పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని తయారుచేసుకోవడం (పార్ట్ 3)

మన జీవితంలో చాలా ముఖ్యమైన మరియు ఇతర అంశం, మనలో ఉన్న ప్రతికూల వ్యక్తిత్వ లక్షణాలను చెరిపివేయడం లేదా తొలగించడం. అవి బయటికి రాకుండా మరియు మన రోజువారీ వ్యవహారాలకు ఆటంకం లేదా అడ్డంకి కలిగించకుండా చూసుకోవాలి. స్వపరివర్తన అనే ఈ ప్రత్యేక రంగంలో, కొంతమంది తమ బలహీనతల పట్ల మరింత సున్నితంగా ఉంటారు. వారు వాటిని పూర్తిగా మార్చడానికి లేదా తొలగించడానికి ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉంటారు, అయితే కొందరు తక్కువ సున్నితంగా ఉంటారు మరియు వారి బలహీనతలను గ్రహించలేరు లేదా తనిఖీ చేయలేరు మరియు వాటిని మార్చలేరు. ఆధ్యాత్మిక శక్తి అనేది స్వపరివర్తన లో తదుపరి దశ, కానీ మొదటి ప్రధానమైన శక్తి నా లోపల ఒక నిర్దిష్ట బలహీనత ఉందని గ్రహించే శక్తి. నేను గ్రహించకపోతే ఆ శక్తిని నా లోపలికి తీసుకురావడానికి నేను పని చేయను. అలాగే, గ్రహించిన తర్వాత, మనల్ని పరిపూర్ణ వ్యక్తిత్వానికి తీసుకెళ్లే మాటలు, మరియు కర్మల స్థాయిలో ఆలోచనా విధానాలు మరియు ప్రయత్నాల గురించి ఆలోచించాలి. మనకు మరియు ఇతరులకు కూడా అసంతృప్తి కలిగించే లోపాలు లేదా బలహీనతలను మనం తొలగించాలి.

చివరగా, స్వపరివర్తనలో ఉపయోగించవలసిన అతి ముఖ్యమైన సాధనం, ఉన్నత ఆధ్యాత్మిక మూలం నుండి శక్తిని తీసుకొని, ఆ శక్తిని మన ఆలోచనలను మార్చడానికి ఉపయోగించడం. అలాగే ఆ శక్తి మన ఆలోచనల విత్తనాన్ని-మన వ్యక్తిత్వాన్ని మార్చడంలో సహాయపడుతుంది. ఒకసారి వ్యక్తిత్వం మారిన తర్వాత, మన ఆలోచనలు తదనుగుణంగా రూపుదిద్దుకోవడం ప్రారంభిస్తాయి. ఆలోచనలు మారిన తర్వాత, మన భావాలు, వైఖరులు, దృష్టి, మాటలు మరియు కర్మలు సానుకూల దిశ వైపు కదులుతాయి. స్వపరివర్తన అంత కష్టం కాదు, కానీ ఆధ్యాత్మిక శక్తి లోపిస్తే అది కష్టంగా అనిపించవచ్చు. కాబట్టి, ధ్యానం అనేది స్వయంలోని అన్ని మార్పులకు పునాది, అది కొత్త లక్షణాలు మరియు శక్తులను గ్రహించడం కావొచ్చు లేదా బలహీనతలను తొలగించడం ద్వారా మంచి వ్యక్తిగా మారడం కావొచ్చు. ధ్యానం అనేది ఆధ్యాత్మిక శక్తి యొక్క మహాసముద్రం అయిన పరమాత్మ లేదా దేవునితో మనస్సు లేదా ఆలోచనల స్థాయిలో ఉన్న సంబంధం.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

2nd july 2024 soul sustenance telugu

ఇతరుల విజయం పై సంతోషించండి  

మనం ఒకరి బలహీనతలు లేదా వైఫల్యాల గురించి ఆలోచించినప్పుడు లేదా మాట్లాడినప్పుడు, మనం వాటినే కొనసాగిస్తూ ఉంటాం. కానీ మనం వారి బలాలు లేదా విజయం గురించి మాట్లాడితే, వాటిని ఒకే వాక్యంలో ముగిస్తాం.

Read More »
1st july 2024 soul sustenance telugu

మీ మనస్సును జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభించండి- మనస్సు ఆలోచనల అంతర్గత కర్మాగారం

మనకు రోజుకు 50,000 వస్త్రాలను తయారు చేసే కర్మాగారం ఉందని అనుకుందాం, వాటిలో కొంత భాగం మాత్రమే ఉపయోగకరంగా ఉంటే, మిగిలినవి ఉపయోగం లేకుండా ఉంటే అది తెలివైన పని కాదు కదా. మన

Read More »
30th june2024 soul sustenance telugu

భగవంతుడు బోధించిన రాజయోగంతో మీ జీవితాన్ని మార్చుకోండి

మనమందరం రెండు వాస్తవాలతో కూడిన ప్రపంచంలో ఉన్నాము – అంతర్గత వాస్తవికత మరియు బాహ్య వాస్తవికత. అంతర్గత వాస్తవికత మన ఆలోచనలు, భావాలతో పాటు మన అంతర్గత వ్యక్తిత్వం లేదా సంస్కారాలు.  బాహ్య వాస్తవికత

Read More »