Hin

26th june2024 soul sustenance telugu

June 26, 2024

విజయం కోసం పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని తయారుచేసుకోవడం (పార్ట్ 2)

మనలో లోపించే చాలా ముఖ్యమైన మరియు అవసరమైన ఆధ్యాత్మిక బలం అవతలి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మరియు ప్రవర్తన ప్రకారం మలచుకునే శక్తి. మిమ్మల్ని మీరు మలుచుకోవడం అంటే పరిస్థితి యొక్క అవసరానికి అనుగుణంగా లేదా ఒక వ్యక్తితో వ్యవహరించడంలో అవసరమైన విధంగా మీ స్వభావాన్ని సర్దుబాటు చేసుకోవడం. నా ఒక నిర్దిష్ట ప్రవర్తన కారణంగా ఎవరైనా కోపంగా ఉన్నారని అనుకుందాం. అటువంటి పరిస్థితిలో నేను సరిగ్గా ఉండవచ్చు మరియు అవతలి వ్యక్తి నాలో తప్పు కనుగొనడం తప్పు అని భావించవచ్చు. అటువంటి సందర్భంలో, మనల్ని మనం తీర్చిదిద్దుకోవడం అంటే తక్కువ వాదించడం, వినయంగా ఉండటం, నేనే సరైనవాడిని అన్న స్మృతిని  త్యాగం చేయడం. మరోవైపు, గౌరవం ఇవ్వడం, సానుకూలంగా ఉండడం, అవతలి వ్యక్తిని ముందు ఉంచడం, సర్దుబాటు అయ్యే వ్యక్తికి సంకేతాలు. అలాగే, మూడవ బలం లేదా శక్తి అనేది మంచి మరియు చెడు, సరైన మరియు తప్పు మధ్య వివక్ష చూపడంతో పాటు ఆలోచనలు, మాటలు, చర్యల రూపంలో సరైనదాన్ని ఎంచుకుని వాటిని ఆచరణలోకి తీసుకువచ్చే శక్తి. ఒక నిర్దిష్ట పరిస్థితిలో, ముఖ్యంగా వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు, నాకు రెండు ఎంపికలు ఉన్నాయని నాకు తెలుసు అనుకుందాం. అటువంటి సందర్భంలో, నా బుద్ధిలో ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఉపయోగించడం,  సరిగ్గా వివక్ష చూపడం మరియు సరైన నిర్ణయం తీసుకోవడం మంచి అభ్యాసం.

ఇతర శక్తులు ఒక పరిస్థితిని లేదా వ్యక్తిని సహించే శక్తిని కలిగి ఉంటాయి. కొన్నిసార్లు, చాలా సందర్భాల్లో మనం ఒక వ్యక్తి యొక్క భిన్నమైన వైఖరిని ఎదురుకోలేకపోవడంతో మనం ప్రతికూలంగా స్పందిస్తాము. అటువంటి సందర్భంలో, ఈ శక్తి లేకపోవడం కారణం. అలాగే, ఎదుర్కొనే శక్తి ఒక ముఖ్యమైన శక్తి, ఇది లేకపోవడం వల్ల మనం కష్టమైన పరిస్థితులకు భయపడతాము.కొన్నిసార్లు, ఇద్దరు వ్యక్తులు ఒకే పరిస్థితిని భిన్నంగా అనుభవించవచ్చు మరియు గ్రహించవచ్చు, ఎందుకంటే వారు ఒకే శక్తిని వివిధ స్థాయిలలో కలిగి ఉంటారు. మనందరికీ ఏదో ఒక శక్తిలో లోపం ఉంది కాబట్టి సాధన మరియు స్థిరమైన స్వీయ ప్రయత్నం ద్వారా మాత్రమే మనం చాలా బలంగా, అన్ని ముఖ్యమైన శక్తులతో నిండి ఉండగలము.

(సశేషం …)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

2nd july 2024 soul sustenance telugu

ఇతరుల విజయం పై సంతోషించండి  

మనం ఒకరి బలహీనతలు లేదా వైఫల్యాల గురించి ఆలోచించినప్పుడు లేదా మాట్లాడినప్పుడు, మనం వాటినే కొనసాగిస్తూ ఉంటాం. కానీ మనం వారి బలాలు లేదా విజయం గురించి మాట్లాడితే, వాటిని ఒకే వాక్యంలో ముగిస్తాం.

Read More »
1st july 2024 soul sustenance telugu

మీ మనస్సును జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభించండి- మనస్సు ఆలోచనల అంతర్గత కర్మాగారం

మనకు రోజుకు 50,000 వస్త్రాలను తయారు చేసే కర్మాగారం ఉందని అనుకుందాం, వాటిలో కొంత భాగం మాత్రమే ఉపయోగకరంగా ఉంటే, మిగిలినవి ఉపయోగం లేకుండా ఉంటే అది తెలివైన పని కాదు కదా. మన

Read More »
30th june2024 soul sustenance telugu

భగవంతుడు బోధించిన రాజయోగంతో మీ జీవితాన్ని మార్చుకోండి

మనమందరం రెండు వాస్తవాలతో కూడిన ప్రపంచంలో ఉన్నాము – అంతర్గత వాస్తవికత మరియు బాహ్య వాస్తవికత. అంతర్గత వాస్తవికత మన ఆలోచనలు, భావాలతో పాటు మన అంతర్గత వ్యక్తిత్వం లేదా సంస్కారాలు.  బాహ్య వాస్తవికత

Read More »