HI

8th may 2024 soul sustenance telugu

May 8, 2024

శాశ్వతమైనది మరియు స్థిరమైన దానిపై శ్రద్ధ వహించడం

మనం తాత్కాలికమైన మరియు ఒక జన్మకు మాత్రమే పరిమితమైన గుర్తింపులతో కూడిన జీవితాన్ని గడుపుతున్నాము. భౌతిక గుర్తింపుపై ఆధారపడిన మన చాలా బిజీ జీవనశైలిలో, మనం ఆధ్యాత్మిక గుర్తింపును  మర్చిపోవడం చాలా సులభం.  మన శాశ్వత గుర్తింపు ఏమిటి?  లేదా మనం ఆధ్యాత్మికంగా ఎవరము?  అనే సరైన జ్ఞానం మనకు లేకపోవడమే కాక మన భౌతిక గుర్తింపులైన పేరు-ప్రఖ్యాతలు, విద్యావృత్తులు, జాతిమతాలు, మొదలైనవి రోజంతా మనల్ని వాటి వైపుకు లాగుతాయి. కానీ, భగవంతుడు మనకు ఆధ్యాత్మిక గుర్తింపును తెలిపారు. భౌతిక గుర్తింపులన్నీ ప్రతి జన్మలో మారుతూ ఉంటాయి. ప్రతి జన్మలో మనం వాటితో అనుబంధం పెంచుకుంటూ, పోగొట్టుకుంటూ ఆత్మ అలసిపోవడం వల్ల దాని ఆనందం మరియు తేలికతనం  తగ్గుతుంది. ఈ రోజు ప్రపంచంలోని ప్రతి ఆత్మతో ఇదే జరుగుతోంది. ఇది ఆంతరిక అలసటకు కారణమయ్యి అనేక జన్మల ప్రయాణంలో ఆత్మ నెమ్మదిగా శక్తిని కోల్పోతోంది.

ఇప్పుడు భగవంతుడు మనకు ఆత్మ చైతన్యాన్ని కలిగిస్తున్నారు. అనేక జన్మల సుదీర్ఘ ప్రయాణం తరువాత, మనం మళ్ళీ ఆత్మను శక్తివంతం చేసుకోవాలంటే, మొదట మనం రోజులో చేసే ప్రతి పనిని ఆత్మిక స్థితిలో చేయడం ప్రారంభించాలి. తద్వారా మనం మన ఆధ్యాత్మిక శక్తిని కోల్పోకుండా ఆత్మిక స్మృతి లేదా ధ్యానం ద్వారా భగవంతునితో కూడా కనెక్ట్ అవ్వాలి. దీనితో పాటుగా, మనం ఆత్మను భగవంతుని యొక్క గుణాలతో, అందరికీ ప్రయోజనం కలిగించే వారి ముఖ్యమైన ప్రత్యేకతలతో, ఆధ్యాత్మిక జ్ఞానంపై ఆధారపడిన సంస్కారాలు మరియు విశ్వాసాలతో, ఆత్మగౌరవం మరియు ఇతరులకు గౌరవం ఇవ్వడం అనే వృత్తితో, దృఢ సంకల్పంతో మరియు నిశ్చయంతో స్వపరివర్తన చేసుకుంటూ ఉండాలి. భగవంతుని నుండి వివిధ రకాలైన ఆధ్యాత్మిక ప్రాప్తులతో ఆత్మకు పోషణను అందించాలి. అలాగే మన ఆలోచనలు మరియు సమయాన్ని నూతన ప్రపంచాన్ని సృష్టించడంలో వెచ్చించాలి. ఇది మనలో విశ్వసేవాధారి స్వభావాన్ని నింపుతుంది. ఈ విభిన్న గుణాలన్నింటినీ మన భవిష్యత్ జన్మలలో మనతో పాటు తీసుకువెళతాము. ఇవన్నీ ఆత్మను అనేక జన్మలకు అవసరమైన వాటితో మనల్ని నింపుతాయి. అలాగే, ప్రతి జన్మ యొక్క మన భౌతిక వాస్తవికత కూడా వాటి నుండి ప్రయోజనం పొంది ప్రతి జన్మ శాశ్వతంగా అందంగా మారుతుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

16th may 2024 soul sustenance telugu

అంగీకారం మరియు అవగాహనతో సహించండి

సహన శక్తి అంటే పరిస్థితులు, వ్యక్తులు మనం అనుకున్నట్లుగా లేనప్పుడు ఆంతరికంగా ప్రభావితం కాకుండా ఉండగల సామర్ధ్యం. ఈ శక్తి దాపరికం లేకుండా ఉండటం, అంగీకరించడం మరియు అంతరికంగా ఏదైనా వివాదాన్ని సరైన అవగాహనతో

Read More »
15th may 2024 soul sustenance telugu

సంబంధాలలో క్షమించడం మరియు మరచిపోవడం

సంబంధాలలో తేలికగా మరియు స్థిరంగా ఉండటానికి ఒక ముఖ్యమైన సూత్రం – క్షమించడం మరియు మరచిపోవడం(ఫర్గివ్ అండ్ ఫర్గెట్)  – ఇది సుప్రసిద్ధ సూత్రం – అది ఆచరించడం మనకు కొన్నిసార్లు కష్టమనిపిస్తుంది. దానినే

Read More »
14th may 2024 soul sustenance telugu

ఆనందాన్ని వెతకకండి, సృష్టించండి

మనలో చాలా మంది ఆనందాన్ని కఠినతరం చేస్తారు, కాబట్టి ఇది తాత్కాలిక భావోద్వేగంగా కనిపిస్తుంది. భౌతికమైనవి సంపాదించడానికి, మనం ఏదైనా చేయవలసుంటుంది. అలాగే ఆనందాన్ని సంపాదించడానికి కూడా ఏదో ఒకటి చేయాలి అనే అనుకుంటాము.

Read More »