HI

17th may 2024 soul sustenance telugu

May 17, 2024

కోల్పోయిన స్వర్గాన్ని తిరిగి పొందడం (పార్ట్ 1)

వివిధ దేశాలు, మతాలకు చెందిన వివిధ రకాల వ్యక్తులతో నిండిన ప్రపంచంలో మనం జీవిస్తున్నాము. మనమందరం మన కోసం ఎటువంటి దుఃఖం, అశాంతి లేని ఒక మంచి అస్తిత్వాన్ని సృష్టించుకోవాలని ఆకాంక్షిస్తున్నాము. మనమందరం ఐక్యంగా ఉండాలని మరియు ఒకరికొకరు శాంతి మరియు ఆనందాన్ని పంచుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే, మనమందరం మన  మధ్య అభిప్రాయ భేదాలు లేకుండా, ఒకరికొకరం చాలా ప్రేమ, గౌరవంతో ఒక పెద్ద కుటుంబంలా ఉండాలనుకుంటాము. ప్రపంచ చరిత్రలో చాలా మంది ప్రపంచ నాయకులు కూడా శాంతి, ప్రేమ మరియు ఆనందంతో కూడిన ప్రపంచాన్ని సృష్టించేందుకు ప్రయత్నించారు.

కాబట్టి, అందరి హృదయాలలో ఈ కోరిక ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా భగవంతుడు విశ్వపిత , తన పిల్లలందరూ సంతోషంగా ఉండాలని, దుఃఖం మరియు ఒత్తిడి నుండి విముక్తి పొందాలని కోరుకుంటారు. అయితే వివిధ రకాల హింస, ప్రకృతి వైపరీత్యాలు, అధిక జనాభా, ప్రపంచ వనరుల కొరత, అభిప్రాయ భేదాలు వంటి కొన్ని అంశాలు దీనిని జరగకుండా ఆపుతాయి అనేది కూడా నిజం. అలాగే, ప్రపంచంలో కొన్ని చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి, అందరి సంతోషాన్ని నిరోధిస్తుంది.

దానితో పాటు, మానవ విలువ దిగజారిపోతున్నాయి. కోపం, అహంకారం, దురాశ, అసూయ మరియు ద్వేషం వ్యక్తిత్వంలో భాగంగా మారిన వ్యక్తుల స్వభావాలు కూడా ఈ లక్ష్యాన్ని సాధించడానికి అనుమతించడం లేదు. కాబట్టి, మనం కోరుకున్నది నెరవేర్చడానికి ఏమి చేయాలి?  ఆధ్యాత్మిక శక్తి లేకుండా ఈ కల నిజం కాదు. ప్రపంచంలో అందరికీ ఆధ్యాత్మిక శక్తిని అందించగల ఏకైక వ్యక్తిత్వం కలవారు,  దానితో పూర్తిగా నిండి ఉన్న వారు అంటే మన పరమ తండ్రి లేదా భగవంతుడు. వారిని సర్వ శక్తివంతుడు అని అంటారు. సర్వ శక్తివంతుడు అనగా మనం ఆధ్యాత్మిక శక్తిని సూచిస్తున్నాము అంతే కానీ భౌతిక శక్తిని కాదు. భౌతిక శక్తి ఈ లక్ష్యాన్ని సాధించలేదని మన చరిత్రలో మనం ఇప్పటికే చూశాము.

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

3rd june2024 soul sustenance telugu

ఆత్మను మరియు అది ఎలా పని చేస్తుందో తెలుసుకుందాం  (పార్ట్ 1)

మీ గతం ఏమిటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?  అంటే జీవితం శాశ్వతమైనదని లేదా మరో మాటలో చెప్పాలంటే జీవితం ఒక్క జన్మ వాస్తవం కాదని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఆత్మ అంటే ఏమిటో మనందరికీ

Read More »
2nd june2024 soul sustenance telugu

కఠిన  పరిస్థితుల కోసం జ్ఞానం- (నథింగ్ న్యూ) కొత్తేమీ కాదు 

చాలా సార్లు కొత్త ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు, ఇది మునుపటి పరిస్థితుల కంటే చాలా కష్టంగా అనిపించి, ఈసారి పరిస్థితిని అధిగమించడం సులభం కాదని మనకు అనిపిస్తుంది.  ఎందుకు అలా ఉంటుంది?  అలాగే, మన

Read More »
Soul-sustenance-1st-june-telugu. Jpeg

విమర్శలకు స్థిరంగా ఉండటం

ఏ ఉద్దేశంతో అయినా,  ఏ రకమైన విమర్శను అంగీకరించడం కష్టం. కానీ మనం దానిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటే మనకు ఖచ్చితంగా లాభమే. మన పట్ల వచ్చిన  విమర్శలు మన నియంత్రణలో ఉండవు ,

Read More »