HI

14th april 2024 soul sustenance telugu

April 14, 2024

భగవంతుని అందాన్ని అర్థం చేసుకొని అనుభవం చేసుకోవటం

మనమందరం భగవంతుని అందమైన, ప్రత్యేకమైన పిల్లలం. మన జీవితంలోని ప్రతి క్షణంలో భగవంతుని ప్రేమ మరియు శక్తితో మనం రక్షించబడుతున్నాము. వారి సహాయాన్ని మనం అనుభవం చేసుకోని రోజు లేదు. ప్రపంచంలోని కోట్లాది మంది ఆత్మలకు ఒకే సమయంలో సహాయం చేసి రక్షించే భగవంతుడు ఎంత అందంగా ఉంటారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా. భగవంతుని సౌందర్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి మరియు దానిని అనుభవం చేసుకోవటానికి 5 విధాలను చూద్దాం –

  1. రోజు కోసం సంకల్పాల టైమ్-టేబుల్ ను పెట్టుకోండి – ప్రతి ఉదయం, మీరు మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితపు పనులను ప్రారంభించే ముందు, మీరు రోజులో మీ ఆలోచనలు మరియు భావాలలో భగవంతుడిని ఎలా ఉంచుతారో అని ఒక టైమ్‌టేబుల్‌ను రూపొందించుకోండి మరియు ఆ టైమ్‌టేబుల్‌ను అనుసరించండి. ఇది మిమ్మల్ని భగవంతునితో అనుసంధానం చేస్తుంది మరియు మీరు నిరంతరం వారి అందాన్ని అనుభవం చేసుకుంటారు.
  2. మెడిటేషన్ లో భగవంతునితో మాట్లాడండి – భగవంతుని అందాన్ని తెలుసుకోవడానికి, 7 విభిన్న సంబంధాలలో వారిని అనుభవం చేసుకోండి – తండ్రి, తల్లి, టీచర్, సద్గురువు, స్నేహితుడు, ప్రియుడు మరియు బిడ్డ. మెడిటేషన్ లో ఈ విభిన్న సంబంధాలలో వారితో మాట్లాడండి. వారు అందించే స్పందనను మరియు మంచితనాన్ని అనుభవం చేసుకోండి.
  3. దైవత్వాన్ని ప్రసరింపజేసే మంచి వ్యక్తిగా అవ్వండి – మీ హృదయంలో భగవంతుని అందం, వారి సాన్నిహిత్యాన్ని నిరంతరం అనుభవం చేసుకోవడానికి, స్వచ్ఛత, వినయం, దయ, నిజాయితీ, క్షమాపణ మరియు నిస్వార్థత వంటి దివ్యమైన గుణాలతో నిండి ఉండటం ముఖ్యం. ఆత్మ లోపల మంచితనం ఉన్నచోట, లోతైన భగవంతుని అనుభవం ఉంటుంది.
  4. ప్రతిరోజు కొత్త విధాన్నాల్లో భగవంతుడిని అనుభవం చేసుకోండి – ప్రతిరోజు భగవంతుడిని మునుపటి రోజు కంటే మరింత కొత్తగా మరియు అందంగా అనుభవం చేసుకోండి. భగవంతుని యొక్క విభిన్న వ్యక్తిత్వ లక్షణాల గురించి, వారి విభిన్న గుణాలు మరియు శక్తుల గురించి ఆలోచించండి. వారి వ్యక్తిత్వాన్ని లోతుగా తెలుసుకొని, వారి వైబ్రేషన్లను ప్రతిరోజూ కొత్త రూపాల్లో గ్రహించండి.
  5. భగవంతుని అందాన్ని ఇతరులతో పంచుకోండి – ప్రతిరోజూ భగవంతుని అందాన్ని మరింత అనుభవం చేసుకోవటానికి, మీ ఆలోచనలు, వైబ్రేషన్లు, దృష్టి, మాటలు మరియు చర్యల ద్వారా ఇతరులను భగవంతుని అందం యొక్క అనుభవానికి దగ్గరగా తీసుకురండి. మీరు ఎంత ఎక్కువగా చేస్తే, భగవంతుడు తన ప్రేమ మరియు సాన్నిహిత్యం యొక్క లోతైన అనుభవాలను ప్రతిరోజూ మీకు ఇస్తారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

29th april 2024 soul sustenance telugu

ఆత్మ కోసం 7 విటమిన్లు

విటమిన్లు భౌతిక శరీరానికి శక్తి నింపే పోషకాలు. మనం ఆహారం ద్వారా వివిధ విటమిన్లను తీసుకుంటాము. ఆధ్యాత్మిక జ్ఞానం మరియు ధ్యానం రెండూ భగవంతునితో సంబంధం జోడించే విధానాలే, ఇవి 7 ఆధ్యాత్మిక విటమిన్లతో

Read More »
28th april 2024 soul sustenance telugu

మనసు  యొక్క  నియంత్రణ (పార్ట్ 3)

మీ మనస్సును శాంతియుతమైన ఆధ్యాత్మిక శక్తితో అనుసంధానించడం మీ రోజువారీ జీవితంలో చాలా మంచి అభ్యాసం. భగవంతుడు ఆధ్యాత్మిక శక్తికి మూలాధారం, వారు ఒక వ్యక్తి కారు. వారు  భౌతిక కళ్ళకు కనిపించని, మనస్సుతో

Read More »
27th april 2024 soul sustenance telugu

మనసు  యొక్క  నియంత్రణ (పార్ట్ 2)

మనమందరం మన జీవితంలో అనేక ఉద్ధేశ్యాలు, లక్ష్యాలతో జీవిస్తాము. కొన్నిసార్లు ఈ జీవిత లక్ష్యాలు మనస్సు మరియు దాని ఆలోచనల పై ఆధిపత్యం చెలాయిస్తాయి. కాబట్టి జీవితంలోని విభిన్న పరిస్థితుల ప్రభావాన్ని నిర్వీర్యం చేయడానికి

Read More »