HI

2nd may 2024 soul sustenance telugu

May 2, 2024

ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు పొందండి

ఆశీర్వాదాలు మనం పరస్పరం పంచుకునే సానుకూల శక్తి ప్రకంపనలు, అవి సత్సంబంధాలను సృష్టిస్తాయి. పరమాత్ముడు ఆశీర్వాదాలు ఇచ్చిపుచ్చుకునే కొన్ని సుందరమైన పద్ధతులను చెప్తున్నారు. వాటిలో కొన్నింటిని అర్థం చేసుకుందాం –

 

  1. మనం ఇతరులను కలిసినప్పుడు వారితో గత పరస్పర చర్య గురించి, వారితో మనకు ఉన్న పని, లేదా కొన్నిసార్లు వారి గురించి మనకు తెలిసిన విషయాలు లేదా వారి బలహీనతల గురించి విన్నవి మన మనస్సులోకి వస్తాయి. బదులుగా మనం వారి ప్రత్యేకతను లేదా ఏదో ఒక సమయంలో వారిలో చూసిన మంచితనం గురించి ఒక ఆలోచన చేద్దాం. ఇది వారికి ఆశీర్వాదాలను ప్రసరిస్తుంది.
  2. మనం ఎవరితోనైనా సంభాషించేటప్పుడు, మీరు చాలా ప్రత్యేకమైన ఆత్మ అని వారికి స్వచ్ఛమైన, సానుకూల భావనను ప్రసరింపజేయండి. వారు చేసే ప్రతి పనిలో ఆనందం మరియు విజయాన్ని పొందాలని మీ మనస్సులో ఆ వ్యక్తి కొరకు శుభ భావన కూడా ఉంచండి. శుభ భావనలు మరియు శుభకామనలు రెండూ ఆశీర్వాదాలుగా పరస్పర చర్యలలో ఆధ్యాత్మిక ప్రేమను నింపుతాయి, ఇతరుల నుండి ఆశీర్వాదాలను తిరిగి అందిస్తాయి.
  3. ఇతరులను కలుసుకున్నప్పుడు, వారిని భగవంతుడు ప్రేమించే పిల్లలుగా చూడండి. మీ దృష్టిని వారి ఆధ్యాత్మిక రూపం లేదా ఆత్మ అనగా వారి నుదిటి మధ్యలో స్వచ్ఛమైన ఆధ్యాత్మిక కాంతిపై ఉంచండి. ఈ ఆధ్యాత్మిక దృష్టి మీ అలవాటుగా మారితే, మీ సానుకూల శక్తి అవతలి వ్యక్తికి ప్రసరిస్తుంది మరియు దానికి బదులుగా అవతలి వ్యక్తి సానుకూలతను, మంచితనాన్ని తిరిగి పంపుతాడు.
  4. మంచి స్వభావం గల ఆత్మకు సంకేతం వారు కలిసిన ప్రతి ఒక్కరికీ ఏదైనా ఇవ్వడం. ఆ ఆత్మకు గుణాలు లేదా శక్తులలో ఏం లోటు ఉందో లేదా వారికి ఏమి అవసరం ఉందో అది మీ దృష్టి, మాటలు మరియు చర్యల ద్వారా వారికి ఇవ్వండి. ఇవి అందమైన ఆశీర్వాదాలు.
  5. చివరగా, అందరికి సహాయపడండి మరియు అందరితో ఉత్సాహంగా సహకరించండి. నేడు, ప్రపంచంలోని ఆత్మలకు మన సానుకూల శక్తి అవసరం మరియు వారు మనకు ప్రసరించే వారి సానుకూల శక్తి నుండి మనం కూడా ప్రయోజనం పొందుతాము. ఇది దీవెనలు ఇవ్వడానికి మరియు స్వీకరించడానికి ఒక ముఖ్యమైన మార్గం.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

16th may 2024 soul sustenance telugu

అంగీకారం మరియు అవగాహనతో సహించండి

సహన శక్తి అంటే పరిస్థితులు, వ్యక్తులు మనం అనుకున్నట్లుగా లేనప్పుడు ఆంతరికంగా ప్రభావితం కాకుండా ఉండగల సామర్ధ్యం. ఈ శక్తి దాపరికం లేకుండా ఉండటం, అంగీకరించడం మరియు అంతరికంగా ఏదైనా వివాదాన్ని సరైన అవగాహనతో

Read More »
15th may 2024 soul sustenance telugu

సంబంధాలలో క్షమించడం మరియు మరచిపోవడం

సంబంధాలలో తేలికగా మరియు స్థిరంగా ఉండటానికి ఒక ముఖ్యమైన సూత్రం – క్షమించడం మరియు మరచిపోవడం(ఫర్గివ్ అండ్ ఫర్గెట్)  – ఇది సుప్రసిద్ధ సూత్రం – అది ఆచరించడం మనకు కొన్నిసార్లు కష్టమనిపిస్తుంది. దానినే

Read More »
14th may 2024 soul sustenance telugu

ఆనందాన్ని వెతకకండి, సృష్టించండి

మనలో చాలా మంది ఆనందాన్ని కఠినతరం చేస్తారు, కాబట్టి ఇది తాత్కాలిక భావోద్వేగంగా కనిపిస్తుంది. భౌతికమైనవి సంపాదించడానికి, మనం ఏదైనా చేయవలసుంటుంది. అలాగే ఆనందాన్ని సంపాదించడానికి కూడా ఏదో ఒకటి చేయాలి అనే అనుకుంటాము.

Read More »